Tue Dec 24 2024 00:29:56 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం నితీశ్ సభలో బాంబు దాడి ?
నలందాలోని సిలావ్ అనే పాఠశాలలో జరిగిన ఓ సభలో సీఎం నితీశ్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే అక్కడ బాంబు దాడి..
బీహార్ : సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్న ఓ సభలో బాంబు దాడి జరిగింది. నలందాలోని సిలావ్ అనే పాఠశాలలో జరిగిన ఓ సభలో సీఎం నితీశ్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే అక్కడ బాంబు దాడి జరిగింది. సీఎం నితీశ్ ఉన్న ప్రాంతానికి 18 అడుగుల దూరంలోనే దాడి జరగడం కలకలం రేపింది. ఈ దాడి ఘటనలో సీఎం నితీశ్ కు ఏం కాలేదని, ఆయన క్షేమంగానే ఉన్నారని పోలీసులు ప్రకటించారు. కాగా.. దాడికి కారణంగా భావిస్తూ ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఇది బాంబు దాడి కాదని, కొందరు వ్యక్తులు టపాకాయలు పేల్చారని మరో వాదన వినిపిస్తోంది. ఇస్లాంపూర్ సత్యర్ గంజ్‌కు చెందిన ఓ వ్యక్తి టపాకాయలు కాల్చారన్నది వారి వాదన. ఏది ఏమైనా సీఎం నితీశ్ పాల్గొన్న సభలో, అది కూడా ఆయనకు అత్యంత సమీపంలో ఈ ఘటన జరగడాన్ని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇది బాంబు దాడా కాదా అన్నది విచారణలో తేలాల్సి ఉంది.
Next Story