Mon Dec 23 2024 19:25:01 GMT+0000 (Coordinated Universal Time)
పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా.. ఊపిరితిత్తుల్లో సమస్యలు?
పోస్ట్ కోవిడ్ తర్వాత.. పలువురు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించామన్నారు. అయితే అది అలసట వల్ల జరుగుతోందా
మీరు కరోనా నుంచి కోలుకున్నారా ? కోలుకున్న తర్వాత ఆరోగ్యం బాగానే ఉందా ? శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా ? కరోనా నుంచి కోలుకున్నాక శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులేంటి అనుకుంటున్నారా! ఈ షాకింగ్ విషయాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా పలువురికి ఊపిరితిత్తుల్లో లోపాలున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైనట్లు అక్కడి సైంటిస్టులు తెలిపారు. కరోనా వైరస్ వల్ల అంతర్గతంగా ఊపిరితిత్తులకు పెద్దఎత్తున నష్టం జరుగుతున్నట్లు వారు ప్రకటించారు. సాధారణ వైద్య పరీక్షల్లో ఈ లోపం తెలియకపోవచ్చని చెప్తున్నారు.
పోస్ట్ కోవిడ్ తర్వాత.. పలువురు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించామన్నారు. అయితే అది అలసట వల్ల జరుగుతోందా లేక కరోనా కారణంగా శ్వాస పోకడలో జరిగిన మార్పుల వల్ల జరుగుతుందా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. ఈ విషయంపై నిగ్గు తేల్చేందుకు బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ఆస్పత్రికి చెందిన ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. బాధితుల ఊపిరితిత్తుల్లో లోపాలను పరిశీలించేందుకు వినూత్నంగా జెనాన్ గ్యాస్ స్కాన్ విధానాన్ని ప్రయోగించారు. దీంతో అసలు లోపం బయటపడింది. బాధితుల ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి సాఫీగా సాగడం లేదని వెల్లడైంది. దీనికి గల కారణాలను వైద్యులు నిర్ధారిస్తే కావాల్సిన చికిత్సలు చేయించుకోవడానికి వీలవుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
Next Story