Sat Nov 23 2024 00:58:05 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా ఎఫెక్ట్ : రికార్డు స్థాయిలో డోలో సేల్స్.. 10 నెలల్లో రూ.567 కోట్లు
జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు.. ఇలా ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా తక్షణ పరిష్కారంగా గుర్తొచ్చేది డోలో 650 మాత్ర. కరోనా కి ముందు
జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు.. ఇలా ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా తక్షణ పరిష్కారంగా గుర్తొచ్చేది డోలో 650 మాత్ర. కరోనా కి ముందు జ్వరం, ఒంటినొప్పులు ఉంటే తప్ప.. ఈ మాత్ర వాడని ప్రజలు.. కోవిడ్ పుణ్యమా అని డోలో 650 వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పాజిటివ్ వచ్చినవారికి, వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ముందుగా ఈ మాత్రలనే ఇస్తున్నారు. మార్చి 2020 నుంచి డోలో సేల్స్ తిరుగులేకుండా జరుగుతున్నాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ మరీ ఎక్కువైతే.. డోలోనే ఆధారమంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
Also Read : ఈరోజు స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
జనవరి 2020 నుంచి చూస్తే.. ఇప్పటి వరకూ డోలో 650 మాత్రే టాప్ లో ఉంది. దీని కంటే ముందు వరుసలో Calpol , Sumo Lలు ఉన్నాయి. ఇండియా వ్యాప్తంగా పారాసిటమాల్ 37బ్రాండ్లు అమ్ముడవుతున్నాయి. డిసెంబర్ 2021లో డోలో 650సేల్స్ రూ.28.9కోట్లు ఉంది. గతేడాది డిసెంబరులో జరిగిన సేల్స్ తో పోలిస్తే ఇది 61.45 శాతం ఎక్కువ. సెకండ్ వేవ్ వచ్చిన సమయంలో ఏప్రిల్, మే 2021లో రూ.48.9కోట్లు, రూ.44.2కోట్ల అమ్మకాలు జరిపింది. డోలో 650 కంపెనీ వెబ్ సైట్ సమాచారాన్ని బట్టి వార్షిక ఆధాయం రూ.2వేల 700కోట్లు ఉండగా ఎగుమతుల నుంచి రూ.920కోట్లు వరకూ ఆదాయం దక్కుతుంది.
Next Story