Fri Nov 22 2024 18:48:22 GMT+0000 (Coordinated Universal Time)
ఒమిక్రాన్ నుంచి తప్పించుకోవాలంటే క్లాత్ మాస్క్ లు సరిపోవు.. !
ఒమిక్రాన్ ను క్లాత్ మాస్కులు అడ్డుకోలేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్ఫెక్షన్ ను నివారించడంలో క్లాత్ మాస్క్ ప్రభావ
భారత్ లో థర్డ్ వేవ్ లో కరోనా, ఒమిక్రాన్.. ఈ రెండు రకాలు ఊహించని రీతిలో విజృంభిస్తున్నాయి. కరోనా, ఒమిక్రాన్ లు సోకకుండా ఉండేందుకు అందరూ ప్రధానంగా తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త మాస్క్ ధరించడం. చాలా మంది క్లాత్ మాస్క్ లనే ఎక్కువగా వాడుతున్నారు. కానీ.. ఒమిక్రాన్ ను క్లాత్ మాస్కులు అడ్డుకోలేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్ఫెక్షన్ ను నివారించడంలో క్లాత్ మాస్క్ ప్రభావవంతంగా పనిచేయడం లేదని చెప్తున్నారు.
Also Read : అక్రమ దందా.. రూ.55 లక్షల విలువైన గంజాయి పట్టివేత
కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ నుంచి రక్షణ పొందాలంటే.. N95, KN95 మాస్క్ లను ఖచ్చితంగా వాడాలని చెప్తున్నారు. సర్జికల్ మాస్క్లు కూడా కొంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. కానీ డబుల్ మాస్క్లు ధరిస్తేనే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మూడు పొరలు కలిగిన మాస్కులను ధరించడం శ్రేయస్కరం అని నిపుణుల అభిప్రాయం.
Next Story