Mon Nov 18 2024 11:38:19 GMT+0000 (Coordinated Universal Time)
రైలు ప్రమాదం.. కాలిపోయిన నోట్ల కట్టలు
తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్ లో ఉన్న రైల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్ లో ఉన్న రైల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇందులో భాగంగా నిన్న ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక పెట్టెలో సగం కాలిన కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. రూ. 500, రూ. 200 నోట్లు ఈ కట్టల్లో ఉన్నట్టు గుర్తించారు. ఆదివారం ఫోరెన్సిక్ నిపుణులు కోచ్‌లో తనిఖీలు చేసారు. ఓ పెట్టెలో సగం కాలిన నోట్లు భారీగా బయటపడ్డాయి. రూ.200, రూ.500 నోట్లు అందులో ఉన్నట్లు గుర్తించారు.
మధురై రైల్వే స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన అద్దె టూరిస్ట్ బోగీలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఉత్తరప్రదేశ్ కు చెందిన తొమ్మిది మంది పర్యాటకులు మరణించారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. ఆగస్టు 17న లక్నో నుంచి బయలుదేరిన ప్రైవేట్ టూర్ ప్యాకేజీలో భాగంగా ఆగస్టు 29న తిరిగి రావాల్సిన బోగీలో మంటలు చెలరేగాయి. మొత్తం 55 మంది టూరిస్టులతో పాటు టూర్ ఆపరేటర్ కు చెందిన ఎనిమిది మంది సహాయక సిబ్బంది బోగీలో ఉన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన వంటగ్యాస్ సిలిండర్ ను అక్రమంగా తరలించిన టూర్ ఆపరేటర్ పై రైల్వే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. టూరిస్ట్ బోగీలో వంటగ్యాస్ సిలిండర్ ను టూర్ ఆపరేటర్ అక్రమంగా తరలించిన కేసులో ఐపీసీ, రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద జీఆర్ పీ క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయినట్టు పోలీసులు గుర్తించారు. వీరి కోసం ప్రత్యేక బలగాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Next Story