Mon Dec 23 2024 07:12:30 GMT+0000 (Coordinated Universal Time)
విద్యార్థిని ఫిర్యాదుతో టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి..ఇంతకీ ఎక్కడ ?
గ్వాలియర్ లో ఉన్న ఒక పాఠశాలలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ ఓ విద్యార్థిని విద్యుత్ శాఖమంత్రి ప్రధుమాన్ సింగ్ తోమకు
సార్ సార్.. మా స్కూల్ లో టాయిలెట్లు సరిగ్గా లేవు సార్. చాలా దుర్వాసన వస్తోంది. దానివల్ల మేం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం అని ఓ విద్యార్థిని మంత్రికి ఫిర్యాదు చేసింది. సరే.. ఆ సమస్యేంటో చూడండి అని మంత్రి వేరేవారికి పని పురమాయించలేదు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. ఆ పాఠశాలకు వెళ్లి టాయిలెట్లను కడిగి శుభ్రం చేశారు. మంత్రి టాయిలెట్లు కడిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవ్వగా.. మంత్రి చేసింది చాలా మంచి పని, ఇలాంటి నాయకులే కదా దేశానికి కావాల్సింది అంటూ.. నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది ? మనదేశంలోనేనా ? అనే కదా మీ అనుమానం. మన దేశంలోనే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందీ ఘటన.
స్వయంగా రంగంలోకి దిగి..
గ్వాలియర్ లో ఉన్న ఒక పాఠశాలలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ ఓ విద్యార్థిని విద్యుత్ శాఖమంత్రి ప్రధుమాన్ సింగ్ తోమకు ఫిర్యాదు చేసింది. వెంటనే మంత్రి తోమర్ ఆ పాఠశాలకు చీపురు, బ్రష్ పట్టుకుని వెళ్లి టాయిలెట్ గదులను శుభ్రం చేశారు. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తను తీసేశారు. ఇకపై పాఠశాలలో టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలని అక్కడున్న సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థిని ఫిర్యాదుతోనే తాను పాఠశాలకు వెళ్లి టాయిలెట్లు శుభ్రం చేసినట్లు స్వయంగా మంత్రి తోమర్ మీడియాకు వివరించారు. గతంలో ఆయన ఇలాంటి పనులు చాలానే చేశారు. గ్వాలియర్ నియోజకవర్గంలోనే ఓ ప్రభుత్వ కార్యాలయంలో టాయిలెట్లు క్లీన్ గా ఉంచడం లేదని ఫిర్యాదు రావడంతో స్వయంగా వాటిని కడిగి క్లీన్ చేశారాయన. ఇటీవలే ఈ నియోజకవర్గంలో బిర్లానగర్ లో 16వ వార్డులో ఉన్న కాల్వలను క్లీన్ చేశారు. ఆ తర్వాత ఓ విద్యుత్ స్తంభం ఎక్కి.. దానిపైనున్న చెత్తను శుభ్రం చేశారు.
Next Story