Mon Dec 23 2024 02:39:15 GMT+0000 (Coordinated Universal Time)
మద్యం మత్తులో పోలీసు కానిస్టేబుల్ చేసిన పాడు పని.. సోషల్ మీడియాలో వైరల్
మధ్యప్రదేశ్లోని హర్దా జిల్లాలో ఒక పోలీసు కానిస్టేబుల్ తన యూనిఫామ్ను తీసివేసి, మద్యం మత్తులో రోడ్డుపై జనం పైకి విసిరిన వీడియో వైరల్ కావడంతో అతన్ని సస్పెండ్ చేశారు. సుశీల్ మాండవి అనే కానిస్టేబుల్ చేసిన పనులకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అతడిని సస్పెండ్ చేసినట్లు హర్దా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) మనీష్ కుమార్ అగర్వాల్ తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ వ్యక్తితో గొడవ పడ్డ కానిస్టేబుల్ అనంతరం బట్టలు విప్పేసి హంగామా సృష్టించాడు.
హార్దా పట్టణంలోని రోడ్డుపై మద్యం సేవించిన పోలీసు కానిస్టేబుల్, మరో చొక్కా లేని వ్యక్తి వారి చుట్టూ జనం ఉన్నా కూడా పట్టించుకోకుండా ఒకరితో ఒకరు వాదించుకోవడం వీడియోలో ఉంది.కానిస్టేబుల్ రోడ్డుపై మోకాళ్లపై కూర్చుని తన యూనిఫాం తొలగించడం ప్రారంభించాడు. మొదట్లో అతను తన చొక్కాను తీసివేసి జనం వైపు విసిరాడు. తరువాత తన ప్యాంటును కూడా తీసివేసి, ఆ వ్యక్తితో గొడవపడటం కొనసాగించాడు.
Next Story