Fri Nov 22 2024 20:05:13 GMT+0000 (Coordinated Universal Time)
స్టాలిన్ ను విమర్శిస్తే సహించేది లేదు.. మద్రాస్ హైకోర్టు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై మద్రాస్ హైకోర్టు ప్రశంసలు కురిపించింది. ఆయనను విమర్శిస్తే సహించేది లేదని పేర్కొంది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై మద్రాస్ హైకోర్టు ప్రశంసలు కురిపించింది. ఆయనను విమర్శిస్తే సహించేది లేదని పేర్కొంది. ఆయన చక్కగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని మద్రాస్ హైకోర్టు స్టాలిన్ కు కితాబిచ్చింది. స్టాలిన్ ను అభినందించకపోయినా పరవాలేదు కాని, విమ్శలు చేస్తే సహించేది లేదని హైకోర్టు హెచ్చరించింది.
జామీను కోసం....
వివరాల్లోకి వెళితే మధురై ప్రాంతానికి చెందిన సాట్లై మురుగన్ స్టాలిన్ పై విమర్శలతో పాటు ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు మురుగన్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ కావాలని కోరుతూ మురుగన్ మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన న్యాయమూర్తి పుగళేంది ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఇచ్చిన హామీని ఒక్కటి అధిగమించినా జామీనును రద్దు చేస్తామని మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది.
Next Story