Mon Dec 23 2024 14:35:59 GMT+0000 (Coordinated Universal Time)
మధురై: రైలులో సజీవదహనమైన ప్రయాణీకులు
మధురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో
మధురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రైలులోని కిచెన్ లో సిలిండర్ పేలడంతో ప్రమాదం చోటు చేసుకుందని అంటున్నారు. రైలు భోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందారు.
తెల్లవారుజామున రైలులోని ఓ కంపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలు చివరి రెండు కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సప్దమాన్ సింగ్ (64), మిథిలేశ్వరి (65) మరణించారని తెలుస్తోంది. మిగిలిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని రక్షించి చికిత్స నిమిత్తం మధురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఐదుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని తెలిసింది. రద్దీగా ఉండే మధురై రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. దీంతో రైల్వే అధికారులు, మదురై నగర పోలీసులు సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story