Mon Dec 23 2024 13:23:58 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఉద్ధవ్ సీరియస్.. ఉన్నతాధికారులపై వేటు?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పోలీసు ఉన్నతాధికారులపై సీరియస్ గా ఉన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పోలీసు ఉన్నతాధికారులపై సీరియస్ గా ఉన్నారు. ఇంతటి సంక్షోభాన్ని ప్రభుత్వం దృష్టికి తేకుండా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందన్న అనుమానం అందరిలో కలుగుతోంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదించాల్సిన ఇంటలిజెన్స్ వ్యవస్థ మహారాష్ట్రలో ఏమై పోయిందని ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే అధికారులను ప్రశ్నించారు. ఎన్సీపీ, కాంగ్రెస్ సయితం పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇంటలిజెన్స్ వ్యవస్థ....
ఈరోజు ఉద్ధవ్ థాక్రే కొందరు అధికారులపై చర్య తీసుకుంటారని తెలుస్తోంది. దాదాపు 30 మందికి పైగా శివసేన ఎమ్మెల్యేలు ముంబయిని విడిచి వెళుతున్నా ఎందుకు పట్టించుకోలేదన్న సందేహం అందరినీ పట్టిపీడిస్తుంది. కొందరు అధికారులు లోపాయికారీగా రెబల్ వర్గానికి సహకరించారని అనుమానిస్తున్నారు. అందుకే ఈరోజు ముఖ్య పదవుల్లో ఉన్న అధికారులపై ఈరోజు ఉద్ధవ్ థాక్రే వేటు వేస్తారని సమాచారం.
Next Story