Mon Dec 23 2024 12:36:03 GMT+0000 (Coordinated Universal Time)
టీకా వల్ల కూతురిని కోల్పోయాను.. రూ.1000 కోట్లు ఇవ్వండి !
మహారాష్ట్రలోని నాసిక్ లో స్నేహాల్ అనే యువతి మెడిసిన్ చదువుతోంది. ఆమె తండ్రి పేరు లునావత్. కరోనాను జయించాలంటే వ్యాక్సిన్
కరోనా టీకా కారణంగా తన కూతురు చనిపోయిందని, అందుకు ప్రతిఫలంగా సీరం సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం తనకు రూ.1000 కోట్లు పరిహారం చెల్లించాలంటూ ఓ తండ్రి హై కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. మెడిసిన్ కోర్సు చదువుతున్న తన కూతురు జనవరిలో వ్యాక్సిన్ తీసుకుందని, దాని వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఆమె ప్రాణం కోల్పోయిందని బాధిత తండ్రి వాపోయాడు. తనకు న్యాయం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు.
మహారాష్ట్రలోని నాసిక్ లో స్నేహాల్ అనే యువతి మెడిసిన్ చదువుతోంది. ఆమె తండ్రి పేరు లునావత్. కరోనాను జయించాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో నిర్వహించిన వ్యాక్సిన్ డ్రైవ్ లో.. ఆరోగ్య కార్యకర్తలంతా టీకా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని లునావత్ తెలిపారు. అయితే టీకా వల్ల ఎలాంటి హానీ ఉండదని, చాలా సురక్షితమని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఎయిమ్స్ డైరెక్టర్, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెప్పిందని తెలిపారు. దీంతో వైద్య కళాశాలలో తన కూతురు వ్యాక్సిన్ తీసుకుందన్నారు. తన కూతురితో పాటు ఎంతోమంది ఆరోగ్య కార్యకర్తలు టీకా తీసుకున్నారని తెలిపారు. 2021, జనవరి 28వ తేదీన టీకా తీసుకున్న కూతురు స్నేహాల్.. మార్చి 1వ తేదీన చనిపోయిందని పిటిషన్ లో పేర్కొన్నారు.
Also Read : జగన్ కీలక నిర్ణయం.. ఆ కేసులన్నీ మాఫీ
స్నేహాల్ కోవీషీల్డ్ టీకా తీసుకోగా.. దాని వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే మృతి చెందిందని వాపోయారు. తనకు న్యాయం చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకే తాను ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. మరి లునావత్ పిటిషన్ ను మహారాష్ట్ర హైకోర్టు స్వీకరిస్తుందా ? విచారణ చేస్తుందా? అన్న విషయం తెలియాల్సి ఉంది.
Next Story