Mon Dec 23 2024 07:26:48 GMT+0000 (Coordinated Universal Time)
హీటెక్కింది.. గవర్నర్ లేఖతో మరింతగా
మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. గవర్నర్ భగవత్ సింగ్ కొష్యారీ అధికారులకు లేఖ రాశారు.
Mumbai : మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. గవర్నర్ భగవత్ సింగ్ కొష్యారీ అధికారులకు లేఖ రాశారు. జూన్ 22 నుంచి 24వ తేదీ వరకూ విడుదల చేసిన నిధులు, జీవోలపై వివరాలు ఇవ్వాలని గవర్నర్ అధికారులను కోరారు. ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చెందిన నియోజకవర్గాలకు నిధులు విడుదల చేశారని ప్రతిపక్ష నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ మేరకు స్పందించారు. గవర్నర్ కరోనా నుంచి కోలుకుని తాజా పరిణామాలపై దృష్టి పెట్టడంతో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ రాజకీయ పార్టీల్లో ఉంది.
ఫ్లోర్ టెస్ట్ కు ఆదేశిస్తే....
అందుకే ఈరోజు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు విడివిడిగా శాసనసభ్యులతో సమావేశమవుతున్నారు. గవర్నర్ విశ్వాస పరీక్షకు ఆదేశిస్తే ఏం చేయాలన్న దానిపై ఈరోజు సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈరోజు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షిండే వర్గం జులై 11వ తేదీ వరకూ ముంబయిలో అడుగుపెట్టడానికి వీల్లేదన్నారు. కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని సంజయ్ రౌత్ చెప్పారు. అయితే షిండే వర్గం ఎమ్మెల్యేలు మాత్రం జులై 5వ తేదీ వరకూ గౌహతిలోనే ఉంటుందని సమాచారం.
Next Story