Sat Nov 23 2024 00:09:26 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు 24 మంది మృతి.. వీరిలో 12 మంది శిశువులు
ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. మృత్యు ఘోష వినిపిస్తోంది. ఒక రోజు 24 మంది మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది..
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో మృత్యు ఘోష వినిపిస్తోంది. రాష్ట్రంలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక రోజు 24 మంది మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతుల్లో 12 మంది నవజాత శిశువులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన మందులు లేకపోవడం, తగిన సిబ్బంది కొరత కారణమని తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో 24 మంది మృతి చెందగా, అందులో 12 మంది పాము కాటు, ఇతర వ్యాధుల కారణంగా మృతి చెందినట్లు ఆస్పత్రి డీన్ శంకర్రావు తెలిపారు. ఇంత మంది మృతిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
కాగా, ఆస్పత్రిలో ఒకేరోజు 12మంది నవజాతా శిశువులతో పాటు 24మంది మృతి చెందిన ఘటనను ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తీవ్రంగా ఖండించారు. ఈ మరణాలు ఖచ్చితంగా యాదృచ్చికం కాదని ఆమె అన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టాలని, గతంలో కూడా ఠానేలో ప్రదర్శించిన అజాగ్రత్తే ఈసారి కూడా కనిపిస్తోందని ఆరోపించారు. ఒకరి తప్పుల్ని మరొకరు కప్పిపుచ్చుకొనేందుకు దాగుడు మూతలు ఆడుతున్నారంటూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఆస్పత్రిలో మందుల కొరత ఒక కారణమైతే సిబ్బంది కొరత కూడా కారణమని ఆరోపిస్తున్నారు.
Next Story