Mon Dec 15 2025 04:03:55 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సుప్రీంలో మహారాష్ట్ర వివాదం
మహారాష్ట్ర రాజకీయం సుప్రీంకోర్టుకు చేరుకుంది. శివసేన అసంతృప్తి నేత ఏక్నాథ్ షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు

Delhi : మహారాష్ట్ర రాజకీయం సుప్రీంకోర్టుకు చేరుకుంది. శివసేన అసంతృప్తి నేత ఏక్నాథ్ షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు ఇవ్వడం, శివసేన శాసనసభ పక్ష నేతగా తనను తొలగించడంపై షిండే సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఈరోజు అనర్హత వేటుకు...
ఈ పిటీషన్ ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దివాలా సభ్యులు గల వెకేషన్ బెంచ్ ఈరోజు పరిశీలించే అవకాశముంది. తనను పార్టీ చీఫ్ గా తప్పించి అజయ్ చౌదరిని నియమించడాన్ని షిండే తప్పుపట్టారు. తన వర్గంలో నలభై మంది ఎమ్మెల్యేలకు పైగానే ఉన్నారని, తక్కువ సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలున్న పార్టీకి విప్ జారీ చేసే అధికారం లేదని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత వేటు నోటీసులు ఈరోజు ఆఖరి తేదీ కావడంతో సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

