Mon Dec 23 2024 08:32:03 GMT+0000 (Coordinated Universal Time)
చర్మంపై ఇన్ఫెక్షన్.. జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్ రద్దు
జాన్సన్ బేబీ పౌడర్ వల్ల శిశువుల చర్మాలపై ఇన్ఫెక్షన్ వస్తోందని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ల్యాబ్ పరీక్షల
పసిపిల్లల చర్మరక్షణకు సాధారణంగా చాలామంది తల్లిదండ్రులు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన ఉత్పత్తులనే వాడుతుంటారు. సబ్బు, షాంపూ, పౌడర్ ఇలా రకరకాల ప్రొడక్టులను జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేస్తుంది. తాజాగా ఆ కంపెనీకి తయారు చేస్తున్న జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్ ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసి.. ఆ సంస్థకు షాకిచ్చింది.
మహారాష్ట్రలో జాన్సన్ బేబీ పౌడర్ వల్ల శిశువుల చర్మాలపై ఇన్ఫెక్షన్ వస్తోందని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ల్యాబ్ పరీక్షల సమయంలో కూడా పీహెచ్ విలువ స్టాండర్డ్ గా లేదని పేర్కొంది. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా లైసెన్స్ ను రద్దు చేసినట్టు తెలిపింది. కోల్ కతాకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
Next Story