Mon Dec 23 2024 12:27:09 GMT+0000 (Coordinated Universal Time)
ఎలక్ట్రిక్ బైక్ రూపొందించిన రైతు.. రూ.14తో 100 కిలోమీటర్ల ప్రయాణం
నాందేడ్ జిల్లా అర్దాపూర్ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ పూల రైతు. 10వ తరగతి చదువుతున్న ధ్యానేశ్వర్.. తనకున్న కొద్దిపాటి పొలంలో
తన అవసరం కోసం రెండేళ్లు శ్రమించాడు ఆ రైతు. ఆఖరికి తను అనుకున్నది సాధించాడు. ఎలక్ట్రిక్ బైక్ ను రూపొందించిన ఆ రైతు.. ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా అర్దాపూర్ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ పూల రైతు. 10వ తరగతి చదువుతున్న ధ్యానేశ్వర్.. తనకున్న కొద్దిపాటి పొలంలో పూలను సాగుచేస్తుంటాడు. పండించిన పూలను మార్కెట్ కు తరలించాలంటే రూ.250 ఖర్చయ్యేది. దాంతో వచ్చే లాభం చాలా వరకూ దారిఖర్చులకే సరిపోయేవి. ఇలాగైతే లాభం గూబంలోకి వెళ్లినట్లే అనుకున్న ధ్యానేశ్వర్.. ఎలాగైనా ఖర్చును తగ్గించాలనుకున్నాడు. ఆ ఆలోచనలోంచి ఆవిష్కృతమైందే.. ఈ ఎలక్ట్రిక్ బైక్.
తన పెట్రోలు బైకును ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పని ప్రారంభించాడు. రెండేళ్లపాటు కష్టనష్టాలు భరించి ఎట్టకేలకు విజయం సాధించాడు. ఆ బైక్ కు 750 ఓల్ట్ సామర్థ్యం ఉన్న మోటారు, 48 ఓల్టుల బ్యాటరీ, ఛార్జర్, కంట్రోలర్, లైట్, ఎలక్ట్రిక్ బ్రేక్ ను విజయవంతంగా అమర్చాడు. నాలుగు గంటలపాటు ఆ బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెడితే.. 100 కిలోమీటర్లు ప్రయాణించేలా తీర్చిదిద్దాడు. తన పెట్రోల్ బైక్ ను విద్యుత్ బైక్ గా మార్చేందుకు రూ.40 వేలు ఖర్చు చేశాడు. 10వ తరగతి చదువుకున్న ధ్యానేశ్వర్ చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో.. అతనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story