Mon Dec 23 2024 19:51:20 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటక వివాదంపై కమల్ హాసన్ ఫైర్
విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందని మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ అన్నారు
విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందని మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ అన్నారు. కర్ణాటకలో చోటుచేసుకున్న హిజాబ్ వివాదంపై కమల్ హాసన్ స్పందించారు. ట్విట్టర్ లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.
జాగ్రత్తగా ఉండాలి...
తమిళనాడుతో సహా ఇతర ప్రాంతాల వారు కూడా అప్రమత్తంగా ఉండాలని కమల్ హాసన్ హెచ్చరించారు. ఇటువంటి చర్యలు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు విద్యాలయాల్లో చోటు చేసుకుంటుండం దారుణమని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.
Next Story