Mon Dec 23 2024 03:25:20 GMT+0000 (Coordinated Universal Time)
గూఢచర్యం కేసులో మరొకరి అరెస్ట్ : కీలక అంశాలు లీక్ ?
సోషల్ మీడియాలో పరిచయమైన ఓ యువతితో నవీన్ చాటింగ్ చేసినట్లు గుర్తించారు. యువతి ట్రాప్ లో పడిన నవీన్..
యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్)తో డిఆర్డిఓ సీనియర్ సైంటిస్ట్ ప్రదీప్ కురుల్కర్ కస్టడీ మంగళవారంతో ముగిసింది. బ్రహ్మోస్, అగ్ని, ఉపగ్రహ విధ్వంసక క్షిపణులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని కురుల్కర్ పాకిస్థాన్‌కు వెల్లడించినట్లు విచారణలో తేలింది. జరా దాస్ గుప్తా అనే పాకిస్థానీ మహిళ కురుల్కర్ ను ట్రాప్ చేసినట్లు ఏటీఎస్ దర్యాప్తులో వెల్లడైంది. తాజాగా.. విదేశాంగ శాఖలో మరో ఉద్యోగి కూడా గూఢచర్యం నిబంధనలను అతిక్రమించినట్లు ఐబీ తెలిపింది. ఐబీ ఇచ్చిన సమాచారం మేరకు యూపీ పోలీసులు కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన నవీన్ పాల్ ను అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో పరిచయమైన ఓ యువతితో నవీన్ చాటింగ్ చేసినట్లు గుర్తించారు. యువతి ట్రాప్ లో పడిన నవీన్.. దేశ భద్రతకు సంబంధించిన కీలక అంశాలను లీక్ చేసినట్లు తెలుస్తోంది. విదేశాంగశాఖకు చెందిన పత్రాలతో పాటు.. జీ20 సమావేశం వివరాలను సైతం నవీన్ లీక్ చేసినట్లు ఐబీ అధికారులు గుర్తించారు. కరాచీకి చెందిన యువతి ఖాతా నుంచి నవీన్ బ్యాంకు ఖాతాకు నగదు బదిలీలు కూడా జరిగినట్లు తెలిపారు. నవీన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. దేశభద్రతకు చెందిన కీలక అంశాలను లీక్ చేసిన విషయాలపై విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story