Mon Dec 23 2024 11:27:16 GMT+0000 (Coordinated Universal Time)
అద్భుతం.. గంగాజలంతో మళ్లీ బ్రతికిన మనిషి !
తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్మశానానికి తీసుకెళ్లారు. చితికి నిప్పంటించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు ఆఖరి సారిగా అతని
ఢిల్లీలోని టిక్రీ ఖుర్ద్ లో అద్భుతం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన చుట్టూ ఉన్నవారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. చనిపోయిన వ్యక్తి నోటిలో గంగాజలం పోయడంతో.. అతను లేచి కూర్చున్నాడు. మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో చితిపై ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు బంధువులు. వైద్యులు అతడిని పరీక్షించి ప్రస్తుతం.. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ వృద్ధుడు మరణించాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలుపగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
నోటిలో గంగాజలం పోసిన వెంటనే..
తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్మశానానికి తీసుకెళ్లారు. చితికి నిప్పంటించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు ఆఖరి సారిగా అతని నోటిలో గంగాజలం పోయగా.. ఆనీరు నోటిలో పడిన వెంటనే ఆయనలో కదలిక వచ్చింది. వెంటనే కళ్లు తెరిచి మాట్లాడాడు. నన్ను స్మశానానికి తీసుకువచ్చారేంటి అని అడగడంతో.. అవాక్కవ్వడం కుటుంబ సభ్యుల వంతైంది. కాసేపటికి తేరుకున్న కుటుంబసభ్యులు.. వృద్ధుడిని అంబులెన్స్ లో నరేలాలోని రాజాహరిశ్చంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.
గంగాజలానికి అంత మహిమ ఉందా ?
బీపీ సాధారణంగానే ఉందని, గుండె కూడా సాధారణంగానే కొట్టుకుంటోందని పేర్కొన్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. గంగాజలానికి ఇంతటి శక్తి ఉందా అని ఇది తెలిసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. నిజంగా గంగాజలానికి అంతటి మహిమే ఉంటే.. చనిపోయినవారందరినీ తిరిగి బ్రతికించుకోవచ్చు కదా.. ఇదంతా ఒట్టి మూఢనమ్మకం అని నాస్తికులు కొట్టిపారేస్తున్నారు.
Next Story