Mon Dec 23 2024 07:14:47 GMT+0000 (Coordinated Universal Time)
13 ఏళ్లుగా మృతదేహంతో జీవిస్తోన్న వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు
సోఫాలో ఉన్న మృతదేహం 2010లో 95 సంవత్సరాల వయస్సులో మరణించిన వ్యక్తి తల్లి అని పోలీసులు అనుమానించారు. దీంతో పోలీసులు..
ఓ వ్యక్తి 13 సంవత్సరాలుగా మృతదేహంతో జీవిస్తున్నాడు. ఆ మృతదేహం అతని తల్లిది. ఈ ఘటన పోలాండ్ లో వెలుగుచూసింది. తల్లి చనిపోగా ఖననం చేశారు. ఖననం చేసిన తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి 13 సంవత్సరాలు తన సోఫాలో ఉంచినందుకు గానూ పోలీసులు మరియన్ ఎల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని బావ ఇంటిలో మృతదేహాన్ని గుర్తించారు.
అక్కడి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 76 ఏళ్ల వయసున్న బంధువు ఫిబ్రవరి 22న రాడ్లిన్ లోని మరియన్ ఎల్ ఇంటికి వెళ్లాడు. అతను వెళ్లేసరికి మరియన్ పిచ్చి పిచ్చిగా బయట తిరుగుతూ కనిపించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. 2009 నుంచీ ఉన్న వార్తపత్రికలో కుప్ప ఉన్న సోఫాలో మృతదేహం ఉన్నట్లు గుర్తించాడు. ఆ అపార్ట్ మెంట్ యజమాని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాడ్లిన్లోని రోగోజినా స్ట్రీట్లోని ఇంటికి వెళ్లారు.
సోఫాలో ఉన్న మృతదేహం 2010లో 95 సంవత్సరాల వయస్సులో మరణించిన వ్యక్తి తల్లి అని పోలీసులు అనుమానించారు. దీంతో పోలీసులు ఆమె సమాధిని పరిశీలించగా అది ఖాళీగా ఉందని తెలిసింది. మరియన్ తన తల్లి మృతదేహాన్ని ఖననం చేసిన వెంటనే తవ్వి తన అపార్ట్మెంట్కు తీసుకెళ్లాడని, మృతదేహం కుళ్ళిపోకుండా ఉండేందుకు రసాయనాలు ఉపయోగించారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మరియన్ ఎల్ మానసిక స్థితిని వైద్యులు పరీక్షిస్తున్నారని వెల్లడించారు. అతనెందుకు ఇలా చేశాడన్నది త్వరలో తెలుస్తుందన్నారు.
Next Story