Sat Nov 23 2024 02:59:36 GMT+0000 (Coordinated Universal Time)
సెల్ఫీ మోజు.. 2 వేల అడుగుల గొయ్యిలో పడ్డాడు.. ఆ తర్వాత?
సెల్ఫీ మోజులో పడి.. సెల్ఫీలకు ఫోజులిస్తూ ఓ యువకుడు జలపాతంలో జారిపడ్డాడు. సోయగావ్ కు చెందిన గోపాల్ తన..
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాగులు, వంకలు పొంగి పొర్లుతుంటాయి. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నదులన్నీ ఉగ్రరూపాలను దాల్చాయి. ఉత్తరాదిన మొన్నటి వరకూ బియాస్ నదికి వరదలు పోటెత్తగా.. విధ్వంసం సృష్టించింది. ప్రస్తుతం యమునా నదికి వరద పోటెత్తుతుండటంతో ఢిల్లీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. గోదావరికి వరద పోటెత్తడంతో.. లంకగ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటు భద్రాచలం, ఇటు ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారులు ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీచేయించి పునరావాసాలకు తరలిస్తున్నారు.
కాగా.. పొంగుతున్న జలపాతాల వద్దకు సెల్ఫీల కోసం వెళ్లి.. ప్రమాద వశాత్తు వాటిలో పడిప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటన మహారాష్ట్రలోని అజంతా గుహల వద్ద చోటుచేసుకుంది. అయితే ఇక్కడ యువకుడు చనిపోలేదు. సెల్ఫీ మోజులో పడి.. సెల్ఫీలకు ఫోజులిస్తూ ఓ యువకుడు జలపాతంలో జారిపడ్డాడు. సోయగావ్ కు చెందిన గోపాల్ తన స్నేహితులతో కలిసి అజంతా గుహలకు వెళ్లాడు. జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా.. బ్యాలెన్స్ తప్పి 2 వేల అడుగుల లోతైన గొయ్యిలో పడిపోయాడు. వెంటనే అతని స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈత రావడంతో అతడు ఓ రాయిని పట్టుకుని ఉండగా.. పోలీసులు, అధికారులు కలిసి అతడిని కాపాడారు.
Next Story