Thu Nov 21 2024 20:38:15 GMT+0000 (Coordinated Universal Time)
కుమార్తె గొంతు కోశాడు.. ఆ తర్వాత తగలబెట్టించాడు.. కానీ..!
ఆగ్రా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) SK సింగ్ మీడియా మాట్లాడుతూ, మే 19న ఖేరాఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్రంగా కాలిపోయిన మహిళను కనుగొన్నారు.
తండ్రి అంటే కుమార్తెను కంటికి రెప్పలా కాపాడేవాడని అంటుంటారు.. కానీ ఈ వ్యక్తి మాత్రం కుమార్తెను చంపేయాలని అనుకున్నాడు. ఆమెను చంపడానికి పగడ్బంధీగా ప్లాన్ వేశాడు కానీ.. అనుకున్నది సాధించలేకపోయాడు. ఆగ్రాలోని భిలావాలి మోడ్ గ్రామంలో తన సొంత కుమార్తెపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
ఆగ్రా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) SK సింగ్ మీడియా మాట్లాడుతూ, మే 19న ఖేరాఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్రంగా కాలిపోయిన మహిళను కనుగొన్నారు. ఆమె గొంతు కూడా కోశారు. ఇన్ని జరిగినా కూడా ఆమె కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉండడంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు SK సింగ్ తెలిపారు.
స్పృహలోకి వచ్చిన తర్వాత, ఆ మహిళ తాను రాజస్థాన్ నివాసినని తన తండ్రి మంగళ్ సింగ్తో కలిసి ఆగ్రాకు వచ్చానని చెప్పింది. తనను హత్య చేయడానికి ప్రయత్నించిన వారిలో తన తండ్రితో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారని చెప్పింది. వారు ఆమెకు నిద్రపోయేలా గుర్తు తెలియని మత్తుమందు ఇంజెక్ట్ చేశారని ఆరోపించారు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చాక తాను ఈ పరిస్థితిలో ఉన్నానని మహిళ చెప్పింది. ఒక పోలీసు బృందాన్ని రాజస్థాన్కు పంపామని, ఆ తర్వాత మంగళ్ సింగ్ను అరెస్టు చేసి ఆగ్రాకు తీసుకొచ్చామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) SK సింగ్ చెప్పారు.
మహిళ తండ్రి నేరాన్ని అంగీకరించాడు. ఆ మహిళ తన పెద్ద కుమార్తె అని, పెళ్లయిన ఐదేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నట్లు చెప్పాడు. తన కూతురు తనతో నిత్యం గొడవపడుతుండడంతో ఆమెను వదిలించుకోవడమే మంచిదని అనుకున్నానని మంగళ్ సింగ్ వెల్లడించాడు. చికిత్స నిమిత్తం ఆమెను ఆగ్రాకు తీసుకువచ్చి తన స్నేహితుడు సంజయ్ సహాయంతో చంపేయాలని అనుకున్నామని మహిళ తండ్రి చెప్పాడు. ఆమెను చంపి మృతదేహాన్ని వదిలించుకోవాలని స్నేహితుడు హామీ ఇచ్చాడని నిందితుడు మంగళ్ సింగ్ చెప్పాడు. పోలీసులు ఇప్పుడు సంజయ్తో పాటు అతని సహచరుల కోసం వెతుకుతున్నారు. కేసును మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News Summary - Agra police on Monday arrested a man for trying to kill his own daughter.
Next Story