Fri Dec 20 2024 08:05:27 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియురాలి కోసం కోర్టుకెక్కిన వ్యక్తి.. రూ.5 వేలు జరిమానా
సదరు యువకుడు తన ప్రియురాలిని అరెస్ట్ చేయాలంటూ.. గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. అంతే కాకుండా..
అప్పుడప్పుడు కోర్టులకు కొన్ని విచిత్రమైన కేసులు వస్తుంటాయి. వాటిలో ఇది కూడా ఒకటి. తాను ప్రేమించిన యువతి తనను కాదని మరొకరిని పెళ్లాడిందన్న కోపంతో.. ఆమెను భర్తనుంచి కస్టడీలోకి తీసుకోవాలంటూ ఓ యువకుడు గుజరాత్ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి పిటిషన్ దాఖలు చేసినందుకు గాను రూ.5000 జరిమానా విధించింది.
సదరు యువకుడు తన ప్రియురాలిని అరెస్ట్ చేయాలంటూ.. గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. అంతే కాకుండా యువతిని ఆమె భర్త అక్రమంగా నిర్బంధించారని ఆరోపించాడు. వెంటనే ఆమెను భర్త నుంచి రక్షించి అదుపులోకి తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నాడు.ఈ పిటిషన్ను గుజరాత్ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో ఏం మాట్లాడాలో తెలియక యువకుడు మిన్నకుండిపోయాడు.
యువతి తన భర్తతో కలిసి ఉండడం చట్ట విరుద్ధం కాదని తేల్చి చెప్పినా.. యువకుడు వాదిస్తుండటం గమనార్హం. తన అంగీకారం లేకుండా పెళ్లి చేసుకుందని, భర్త నుంచి విడిపోయాక తనతో లివిన్ రిలేషన్ షిప్ లో ఉండేందుకు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే దానిని పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్ తో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు మందలిస్తూ.. యువకుడికి రూ.5000 జరిమానా విధించింది.
Next Story