Mon Dec 23 2024 02:49:34 GMT+0000 (Coordinated Universal Time)
Bomb Threat : ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపు
ఢిల్లీలోని నోయిడాలో అనేక పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఢిల్లీలోని నోయిడాలో అనేక పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన స్కూళ్ల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఢిల్లీలోని దాదాపు యాభై పాఠశాలలకు ఈరోజు బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు.
బాంబ్ స్క్కాడ్ తనిఖీలు...
దీంతో స్కూళ్లనుంచి విద్యార్థులను ఖాళీ చేయించి ఇళ్లకు పంపించి వేశారు. బాంబ్ స్క్కాడ్ రంగంలోకి దిగి పాఠశాలల్లో తనిఖీలను చేపట్టింది. ఢిల్లీలోని ప్రముఖ పాఠశాలలకే ఈ బెదిరింపులు వచ్చాయి. నోయిడాలోని పన్నెండు పాఠశాలలకు బెదిరింపుల మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో స్కూళ్లు తెరవకముందే మెయిల్స్ రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Next Story