Sun Dec 22 2024 16:04:29 GMT+0000 (Coordinated Universal Time)
ఛత్తీస్గడ్ లో దారుణం.. ఇద్దరిని హత్య చేసిన మావోలు
తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారన్న కారణంతో మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలో ఇద్దరు సోదరులను హత మార్చారు
ఛత్తీస్గడ్ లో మావోయిస్టులు ఇద్దరిని హత్య చేశారు. ఛత్తీస్గడ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో ఎక్కువ మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారన్న కారణంతో మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలోని చుత్వాహి గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులను హత మార్చారు.
నిద్రిస్తుండగా....
మండవి జోగ, మండవి హుంగాను రాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తుండగా వచ్చిన మావోయిస్టులు దారుణంగా హత్యచ ేశారు. దీంతో ఆ గ్రామంలో భయాందోళనలు మొదలయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చివరకు కుటుంబ సభ్యులు సయితం దీనిపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని పోలీసులు చెబుతున్నారు.
Next Story