Sun Nov 17 2024 20:32:25 GMT+0000 (Coordinated Universal Time)
పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్
దీపావళికి బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నాయన్నది మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పసిడి అంటే ఇష్టపడని వారు ఎవరుండరు? ఎవరు స్థాయిని బట్టి వారు కొనుగోలు చేస్తుంటారు. ప్రతి ఇంట్లో అది ప్రధాన వస్తువుగా మారిపోయింది. ఇక ముఖ్యమైన పండగలకు, ముఖ్యుల పుట్టినరోజులకు కానుకల రూపంలో బంగారు వస్తువు కొనుగోలు చేయడం ఒక అలవాటుగా మారింది. బంగారం కొంటే చాలు ఇంక అంతకంటే మరేమీ లేదని చూస్తారు మహిళలు. అందుకే బంగారానికి భారత్ లో బంగారానికి అధిక డిమాండ్. కార్తీక మాసం ఈ నెలాఖరుకు వస్తుండటంతో బంగారానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశముంది. దీపావళికి ధరలు మరింత పెరగనున్నాయన్నది మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి విలువ వంటి కారణాలు బంగారం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతుంటారు.
స్థిరంగా ధరలు...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వరసగా మూడో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,200 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,850 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ లో 66,000లు పలుకుతుంది.
Next Story