Sun Dec 22 2024 19:05:22 GMT+0000 (Coordinated Universal Time)
ఇదెక్కడి విడ్డూరం అండి.. షాంపూ కారణంగా రద్దైన వివాహం
వధువుకి కూడా అలా కొన్ని విలువైన బహుమతులు పంపించారట. వాటిలో ఒక షాంపూ కూడా ఉంది. అయితే ఆ షాంపూ పై ..
పీటలవరకూ వచ్చిన పెళ్లిళ్లు ఏదొక కారణంచేత ఆగిపోతుంటాయి. పెద్దలు పెళ్లి ఆగకుండా ఉండేందుకు.. ఏదొకటి నచ్చజెప్పి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తారు. మర్యాదల లోటు, భోజనం సరిగ్గా పెట్టలేదని, కట్నం తక్కువైందని, లేదా ప్రేమ వ్యవహారాలు ఇలా రకరకాల కారణాలు పెళ్లిళ్లు ఆగిపోయేందుకు కారణమవుతుంటాయి. కానీ.. ఒక షాంపూ కారణంగా పెళ్లి రద్దైందంటే నమ్ముతారా ? ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది నిజంగా జరిగింది. ఈ విడ్డూరం అసోంలోని గువాహటిలో చోటుచేసుకుంది.
గువాహటికి చెందిన ఓ ఇంజినీర్ తో యువతికి ఈనెల 14న వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు వధువుకి వరుడి తరపున కొన్ని బహుమతులు పంపడం ఆనవాయితీ. ఈ పెళ్లిలో వధువుకి కూడా అలా కొన్ని విలువైన బహుమతులు పంపించారట. వాటిలో ఒక షాంపూ కూడా ఉంది. అయితే ఆ షాంపూ పై ధర చాలా తక్కువగా ఉండటంతో.. ముందు వెనుక ఆలోచించకుండా.. వరుడికి "ఇదేనా నీ స్తోమత" అంటూ మెసేజ్ పంపింది వధువు. ఆ మెసేజ్ తో వరుడు మనస్తాపం చెందాడు. ఒక షాంపూ బాటిలో గురించి తనను అలా అడగడం ఏమాత్రం నచ్చలేదు. అంతే ఈ పెళ్లి జరగదు అంటూ రద్దు చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు క్షమాపణలు చెప్పినప్పటికీ వరుడు వినలేదు. దాంతో వధువు కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Next Story