Sun Dec 22 2024 20:59:36 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లైన నెలరోజులకే భర్తకి షాకిచ్చిన భార్య.. ప్రేయసితో జంప్!
అలీపూర్ ద్వార్ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన యువతి, కూచ్‌బిహార్ జిల్లాలోని తుఫాన్‌గంజ్ ప్రాంతానికి..
భార్య ప్రేయసితో లేచిపోవడం ఏంటి ? తప్పుగా రాశామనుకుంటున్నారా. కాదండి.. మీరు చదివేది నిజమే. ఈ ప్రేమకథ పశ్చిమబెంగాల్ లో జరిగింది. ఇద్దరు అమ్మాయిల మధ్య స్నేహం, ప్రేమగా మారి.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన ఓ అమ్మాయి తల్లిదండ్రులు హడావిడిగా ఓ సంబంధం చూసి పెళ్లి చేసి, హమ్మయ్య అనుకున్నారు. కానీ.. వాళ్లందరితో పాటు కట్టుకున్న భర్తకు కూడా షాకిస్తూ.. పెళ్లైన నెలరోజులకే తన ప్రేయసితో పరారైంది ఆ యువతి.
వివరాల్లోకి వెళ్తే.. అలీపూర్ ద్వార్ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన యువతి, కూచ్‌బిహార్ జిల్లాలోని తుఫాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన మరో యువతి ఒకే కాలేజీలో చదువుకున్నారు. రెండేళ్ల క్రితం వీరిమధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత అది మరింత గాఢంగా మారి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకుంది. విషయం తెలుసుకున్న ఓ అమ్మాయి తల్లిదండ్రులు కుమార్తె అప్పటికప్పుడు సంబంధం చూసి వివాహం జరిపించారు. కానీ వారంతా అనుకున్నట్లు అక్కడితో సమస్య పరిష్కారమవ్వలేదు.
పెళ్లైన నెలరోజులకే మార్చి 8న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన ప్రేయసితో కలిసి మల్దాలోని ఓ హెటల్ గది అద్దెకు తీసుకుని అక్కడ కాపురం పెట్టారు. సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లొచ్చి ప్రశ్నించినా వెనక్కి తగ్గలేదు. తాము మేజర్లమని, తమ సంబంధాన్ని అంగీకరిస్తేనే ఇంటికి వస్తామని, లేదంటే కోర్టుకెళ్తామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరూ మాల్దా పోలీస్ స్టేషన్ లోనే ఉండగా.. పోలీసులు తల్లిదండ్రులను పిలిపించారు. వారికోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.
Next Story