Mon Dec 23 2024 14:33:56 GMT+0000 (Coordinated Universal Time)
భారీ అగ్నిప్రమాదం.. 58 షాపులు దగ్ధం
గురువారం తెల్లవారుజామున ఎర్రకోట ఎదురుగా ఉన్న లజ్ పత్ రాయ్ మార్కెట్లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో
దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎర్రకోట ఎదురుగా ఉన్న లజ్ పత్ రాయ్ మార్కెట్లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 58 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Also Read : ఘోర అగ్నిప్రమాదం.. మంటలు చెలరేగి 13మంది సజీవదహనం
వాటి సామర్థ్యం సరిపోకపోవడంతో మరో 4 ఫైరింజన్లు ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణం ఏమిటన్నది తెలియలేదు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలేవీ తెలియరాలేదు. 58 షాపులు దగ్ధం అవ్వడంతో.. భారీ మొత్తం ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read : భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
Next Story