Mon Dec 23 2024 13:35:26 GMT+0000 (Coordinated Universal Time)
పసిడి ప్రియులకు పండగే.. ఇక ఆలోచించకండి
పసిడి ప్రియులకు కలిసొచ్చే విషయం. ఎంత మంచి వస్త్రాలంకరణ చేసుకున్నా.. ఒంటిపై బంగారం లేకపోతే ఆ వెలితి..
బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. బులియన్ మార్కెట్లో కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం, వెండి ధరలు.. నేడు కూడా కాస్త తగ్గాయి. పెళ్ళిళ్ల సీజన్ లో బంగారం ధరలు తగ్గుతుండటం.. పసిడి ప్రియులకు కలిసొచ్చే విషయం. ఎంత మంచి వస్త్రాలంకరణ చేసుకున్నా.. ఒంటిపై బంగారం లేకపోతే ఆ వెలితి అలాగే ఉండిపోతుంది. అందుకే.. రూపాయి పెరిగినా, తగ్గినా బంగారం కొనుగోలు చేస్తారు. కష్టసమయాల్లోనూ బంగారం ఆదుకుంటుందనేది వారి నమ్మిక.
తాజాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.220 మేర ధర తగ్గింది. అలాగే వెండి కూడా కాస్త దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,200 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర పై రూ.100 తగ్గి.. రూ.78,200గా ఉంది.
Next Story