Mon Nov 25 2024 17:30:16 GMT+0000 (Coordinated Universal Time)
వ్యాపిస్తున్న మరో అంటువ్యాధి.. మీజిల్స్ లో 13 మంది చిన్నారులు మృతి
భారత్ లో ఆరు రాష్ట్రాల్లో మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. బీహార్, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రల్లోని కొన్ని..
కరోనా నుండి బయటికి వచ్చి.. ఇప్పుడిప్పుడే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుతున్నామనుకునే లోపే మరో అంటువ్యాధి భయపెడుతోంది. చిన్నారులకు అధికంగా సోకుతుండటంతో తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ అంటువ్యాధి పేరు మీజిల్స్. దేశ ఆర్థిక రాజధానిలో ఈ వ్యాధిబారిన పడి ఇప్పటికే 13 మంది చిన్నారులు మృతి చెందారు. ఇటీవల ఈ వ్యాధి కారణంగా 8 నెలల చిన్నారి చనిపోయింది. రోజురోజుకీ మీజిల్స్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అప్రమత్తమైంది.
భారత్ లో ఆరు రాష్ట్రాల్లో మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. బీహార్, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రల్లోని కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 233 కేసులు నమోదవ్వగా.. వాటిలో 200 కేసులు గత రెండు నెలల్లో నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే ఆయా రాష్ట్రాల్లో 30 మంది చిన్నారులు మీజిల్స్ వ్యాధితో ఆస్పత్రిలో చేరగా.. 22 మంది డిశ్చార్జ్ అయ్యారు. వ్యాక్సినేషన్ తో వ్యాధి త్వరగా తగ్గుతున్నా.. చిన్నపిల్లలకే ఇది ఎక్కువగా సోకడంతో మరణాలు పెరుగుతున్నాయి. దగ్గు, తుమ్ముల ద్వారా మీజిల్స్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు.
Next Story