Fri Dec 27 2024 04:14:23 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్.. కరోనా కేసులు ఎన్నంటే?
దీపావళి రోజున కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లేనని పేర్కొంది
దీపావళి రోజున కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లేనని పేర్కొంది. ఒక్కరోజులో 87,905 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా 1,334 మందికి మాత్రమే కరోనా వైరస్ గా నిర్ధారణ అయింది. యాక్టివ్ కేసులు కూడా బాగా తగ్గుముఖం పట్టడం సంతోషదాయకమని పేర్కొంది. గత కొద్ది రోజులుగా రెండు వేల కేసులు నమోదవుతున్నాయని, అయితే ఇప్పుడు వాటి సంఖ్య రెండు వేలకు దిగువకు చేరుకుంది.
తగ్గిన యాక్టివ్ కేసులు
దేశంలో ఇప్పటి వరకూ 4.46 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వారిలో 4.40 కోట్ల మంది చికిత్స పొంది కోలుకున్నారని పేర్కొన్నారు. రికవరీ రేటు శాతం 98.76 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 0.05 శాతంగా నమోదయింది. ఇప్పటి వరకూ దేశంలో 5,28,977 మంది కరోనా కారణంగా మరణించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 23,193 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 219.56 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story