Fri Dec 27 2024 20:55:37 GMT+0000 (Coordinated Universal Time)
వైరస్ అదుపులోనే ఉంది కానీ?
1,10,863 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 2,060 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు
భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజుకు రెండు వేలకు పైగానే నమోదవుతున్నాయి. వైరస్ అదుపులో ఉందని భావించవద్దని నిపుణులు చెబుతున్న మాట. వైరస్ ఒక్కసారిగా పెరిగే అవకాశముందని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ నిబంధనలను మాత్రం ఖచ్చితంగా పాటించల్సిందేనని అంటున్నారు. ఒక్క రోజులో 1,10,863 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 2,060 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.
రికవరీ రేటు...
ఇప్పటి వరకూ భారత్ లో 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4.40 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా భారత్ లో 5,28,905 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 98.75 శాతం రికవరీ రేటు ఉందని అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసుల శాతం 0.06 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం భారత్ లో 26,854 ఉన్నాయి. ఇప్పటి వరకూ భారత్ లో 219.33 కోట్ల కరోనా వాక్సిన్ ను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story