Wed Mar 26 2025 18:20:29 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రైతులతో కేంద్రం చర్చలు
నేడు కేంద్రంతో రైతు ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఈ భేటీలో రైతుల డిమాండ్లపై మంత్రులతో చర్చించనున్నారు

నేడు కేంద్రంతో రైతు ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఈ భేటీలో రైతుల డిమాండ్లపై మంత్రులతో చర్చించనున్నారు. గత కొంతకాలంగా రైతులు తమ డిమాండ్ల కోసం ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంత్రులతో మాట్లాడేందుకు కొందరిని నియమించింది. వారితో ప్రాధమికంగా చర్చలు జరపాలని సూచించింది.
తమ డిమాండ్ల సాధనకు...
రైతుల ప్రధానంగా తమ పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ అంశాలపై ఉద్యమిస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు భేటీ కానుండటంతో కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశముంది. ఈ భేటీలో 28 మందితో కూడిన రైతుల ప్రతినిధుల బృందం పాల్గొననుంది.
Next Story