Mon Dec 23 2024 01:30:29 GMT+0000 (Coordinated Universal Time)
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఈయనేనట
మమత బెనర్జీ నేతృత్వంలో మరి కాసేపట్లో విపక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించనున్నారు
మమత బెనర్జీ నేతృత్వంలో మరి కాసేపట్లో విపక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించనున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బిజూజనతాదళ్ దూరంగా ఉన్నాయి. మిగిలిన పార్టీలు ఈ సమావేశానికి హాజరవుతున్నాయి. కాంగ్రెస్ తో సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీయేతర పక్షాలు ఈ సమావేశానికి హాజరుకానున్నాయి.
పవార్ ఆసక్తి చూపకపోవడంతో...
అయితే తొలుత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నారు. కానీ పవార్ విముఖత చూపారు. మమత స్వయంగా వెళ్లి పవార్ తో చర్చించినా ఫలితం లేదు. తాను ఈ ఎన్నికలో పోటీ చేయబోనంటూ తెగేసి చెప్పారు. అయితే ప్రత్యామ్నాయంగా మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరు పరిశీలనలోకి వచ్చింది. గత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గోపాలకృష్ణ గాంధీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఐఏఎస్ అధికారిగా మంచి పేరుంది. ఆయన తర్వాత పశ్చిమ బెంగాల్ కు గవర్నర్ గా కూడా పనిచేశారు. ఆయన పేరును విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశముంది.
Next Story