Thu Nov 21 2024 21:08:59 GMT+0000 (Coordinated Universal Time)
Padmavibhushan : మెగాస్టార్ మెడలో మరొక మణిహారం... వెంకయ్యకు అత్యున్నత పురస్కారం
మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కూడా ఈ పురస్కారం దక్కింది
మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కూడా దేశంలో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. దేశంలో ఐదుగురికి అత్యున్నత రెండో పురస్కారమైన పద్మవిభూషణ్ లభించగా అందులో ఇద్దరు మన తెలుగు రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం. రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం పదిహేడు మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు లభించింది. 132 పురస్కారాల్లో ఎనిమిది మంది మనోళ్లే కావడం విశేషం.
మరో ఆరుగురికి...
మాజీ భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో పాటు మాజీ కేంద్ర మంత్రి, సినీనటుడు చిరంజీవికి కూడా పద్మవిభూషణ్ లభించింది. వీరితో పాటు మరో సీనియర్ నటి వైజయంతీమాల, భరత నాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యంలకు కూడా ఈ అవార్డు దక్కింది. రానున్న మార్చి, ఏప్రిల్ నెలలో వీరందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులతో ఎక్కువ మంది తెలుగువారు ఉండటంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
పద్మశ్రీకి...
పద్మశ్రీకి తెలంగాణకు చెందిన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, విఠలాచార్య, వేలు ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్ ఉన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఏటా పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. వారి సేవలను ప్రభుత్వం గుర్తించి, , కళలు, సామాజిక రంగాల్లో సేవలను ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ఎంపిక చేస్తుంది. పద్మవిభూషణ్ పురస్కారం తనకు దక్కడం పట్ల సినీనటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆనందం వ్యక్తం చేశారు.
Next Story