Mon Dec 23 2024 09:45:14 GMT+0000 (Coordinated Universal Time)
సంజయ్ రౌత్ కు గ్రేట్ రిలీఫ్
పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ కు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ దొరికింది
పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ కు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ దొరికింది. భూ కుంభకోణంలో సంజయ్ రౌత్ అరెస్టయి జైలులో ఉన్నారు. కొన్నాళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్ రౌత్ కు పీఎంఎల్ఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వెయ్యి కోట్ల రూపాయల భూ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సంజయ్ రౌత్ ను అరెస్టు చేశారు.
భూ కుంభకోణంలో...
సంజయ్ రౌత్ శివసేనలో కీలకంగా ఉన్నారు. ఏక్ నాథ్ షిండే వెంట ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు కూడా రౌత్ వారికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను కూడగట్టేందుకు ప్రయత్నించారు. అయితే సఫలం కాలేదు. అప్పుడే రౌత్ పై ఈడీ కేసు నమోదు చేసింది. సంజయ్ రౌత్ కు బెయిల్ లభించడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
- Tags
- sanjay raut
- bail
Next Story