Mon Dec 23 2024 08:13:29 GMT+0000 (Coordinated Universal Time)
మరో 10 వేల మందిపై మెటా వేటు
కాగా.. రానున్న రెండు నెలల్లో తక్కువ ప్రాధాన్యమున్న ప్రాజెక్టులను రద్దు చేస్తామని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. త్వరలోనే..
ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ల మాతృసంస్థ అయిన మెటా.. మరోమారు భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గతేడాది 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన ఆ సంస్థ.. తాజాగా మరో 10 వేల మందిని తొలగించింది. ఈ విషయాన్ని మెటా బ్లాగ్ పోస్ట్ లో వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపుపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ.. వేటుకు గురైన ఉద్యోగులకు క్షమాపణలు కూడా తెలిపింది. ఏప్రిల్లో తొలగింపులు ఉంటాయని సీఈవో మార్క్ జుకర్బర్గ్ తెలిపారు.
కాగా.. రానున్న రెండు నెలల్లో తక్కువ ప్రాధాన్యమున్న ప్రాజెక్టులను రద్దు చేస్తామని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త ఉద్యోగులను తీసుకునే వివరాలను వెల్లడిస్తామన్నారు.రాబోయే నెలల్లో ఓపెన్ రోల్స్లో ఉన్న మరో 5 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి వరకూ ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని, వివిధ స్థాయి, ప్రాంతాల వారీగా తొలగింపులు చేస్తుండటంతో సమయం పడుతుందన్నారు. అయితే.. ఉద్యోగాలు కోల్పోయే వారికి మెటా ఎలాంటి ప్యాకేజీని ఇస్తుందన్న విషయాన్ని మాత్రం జుకర్ వెల్లడించలేదు.
Next Story