Mon Jan 06 2025 15:01:40 GMT+0000 (Coordinated Universal Time)
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్
ఎండలతో అలమటించిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రుతపవనాల కదలిక ప్రారంభమైందని తెలిపింది.
ఎండలతో అలమటించిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రుతపవనాల కదలిక ప్రారంభమైందని తెలిపింది. రుతుపవనాలు పురోగమించడానికి సానుకూల వాతావరణం ఏర్పడిందని పేర్కొంది. అండమాన్ నికోబా్ దీవులు, సముద్రంలో వర్షం పడటంతో రుతుపవనాల రాకకు అనుకూలత ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులులో మరింత కదులుతాయని పేర్కొంది.
జూన్ మొదటి వారంలో...
ఈ ప్రభావంతో వచ్చే నెల మొదటి వారంలోనే రుతపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అప్పటి వరకూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా తెలిపింది. కేరళలోకి ప్రవేశించిన తర్వాత క్రమంగా అన్ని చోట్ల విస్తరిస్తాయని, అప్పటి వరకూ ప్రజలు ఎండ వేడిమి నుంచి తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే వడదెబ్బ తగిలే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
Next Story