Fri Mar 28 2025 04:42:47 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : ఢిల్లీలో నేడు, రేపు భారీ వర్షాలు.. హై అలెర్ట్ ప్రకటన
ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది

ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆరెంజ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ విడుదల చేసింది. ఢిల్లీలో వర్షం అంటేనే భయపడిపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. వాహనాలు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుని అనేక ఇబ్బందులు పడ్డారు.
మరో రెండు రోజులు...
ఇప్పుడు తాజాగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈరోజు ఢిల్లీలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. రహదారులు కూడా నీట మునిగే అవకాశముండటంతో ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థనే వినియోగించాలని, సొంత వాహనాలను బయటకు తీయవద్దని చెబుతున్నారు.
Next Story