Mon Dec 23 2024 02:35:23 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రంపై ఒవైసీ మండిపాటు
కశ్మీరీ లోయలో పండిట్లకు రక్షణ కరువయిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కశ్మీరీ లోయలో పండిట్లకు రక్షణ కరువయిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందన్నారరు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీ పండిట్లకు మేలు జరుగుతుందని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, వారికి భద్రత కల్పించడంలో విఫలమయిందని ఒవైసీ ఆరోపించారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది కశ్మీరీ పండిట్లు ఉగ్రవాదులకు టార్గెట్ గా మారారని, వారు హత్యకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పండిట్ల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదన్నారు ఒవైసీ.
గుజరాత్ లో....
జమ్మూ కశ్మీర్ పాలనలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందన్నారు. అక్కడ లెఫ్ట్నెంట్ గవర్నర్ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. గుజరాత్ లో బల్కిస్ బానో కేసులో నిందితులకు క్షమాబిక్ష పెట్టడం అన్యాయమని ఒవైసీ మండి పడ్డారు. గ్యాంగ్ రేప్ చేసిన నిందితులకు గుజరాత్ ప్రభుత్వం రక్షణగా నిలిచిందన్నారు. ఉత్తర్ప్రదేశ్ లో గాడ్సే ఫొటో పెట్టుకుని తిరంగా యాత్ర చేయడం అత్యంత దారుణమని అన్నారు.
Next Story