Mon Dec 23 2024 09:30:58 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీల్లో విపరీతమైన శృంగార సీన్లు.. కేంద్రం హెచ్చరికలు
దీనికి అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉందని..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు. సినిమాటోగ్రఫీ 1952 బిల్ కు కొన్ని సవరణలు చేస్తూ అనురాగ్ ఠాకూర్ లోక్ సభలో ఈ బిల్ ప్రవేశపెట్టగా అక్కడ పాస్ అయి అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది. ఈ బిల్ ప్రవేశపెడుతున్న సమయంలోనే పలువురు ఎంపీలు ఓటీటీలో వస్తున్న బోల్డ్, వల్గర్ కంటెంట్ పై కేంద్రమంత్రిని ప్రశ్నించారు. సినిమా, సిరీస్ కథల్లో అవసరం లేకపోయినా ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి బూతులు, శృంగార సన్నివేశాలను పెడుతున్నారని.. ఓటీటీకి సెన్సార్ లేకపోవడం వల్లే ఇష్టమొచ్చిన కంటెంట్ టెలికాస్ట్ చేస్తున్నారని ఓటీటీకి సెన్సార్ తీసుకురావాలని కోరారు.
దీనికి అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉందని.. ఓటీటీలో కూడా ఎన్నో మంచి కంటెంట్స్ వస్తున్నాయని.. కొంతమంది మాత్రమే అలాంటి కంటెంట్స్ ని ప్రమోట్ చేస్తున్నారన్నారు. ఇటీవలే ఓటీటీ సంస్థలతో సమావేశం జరిగిందని.. ఓటీటీలకు స్వీయ నియంత్రణ అవసరమన్నారు. ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణలో ఉండి కంటెంట్ ని కంట్రోల్ గా టెలీకాస్ట్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, అవసరమైతే సెన్సార్ కూడా తీసుకురావాల్సి వస్తుందని ఓటీటీ సంస్థలను హెచ్చరించామని అన్నారు. ఇకపై సినిమాను పైరసీ చేసినా, సినిమాని థియేటర్స్ లో మొబైల్స్ తో గానీ, కెమరాతో గానీ రికార్డ్ చేస్తే వారికి మూడేళ్ళ జైలు శిక్షతో పాటు, ఆ సినిమా ప్రొడక్షన్ కోసం అయిన ఖర్చులో 5 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుందని అన్నారు.
Next Story