అక్టోబర్ 21: మిషన్ 'గగన్ యాన్' కు ఎంతో కీలకం
అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపే గగన్‌యాన్ మిషన్ లో అక్టోబర్ 21న
అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపే గగన్‌యాన్ మిషన్ లో అక్టోబర్ 21న కీలక అడుగు ముందుకు పడనుంది. టీవీ-డీ1 టెస్ట్ ఫ్లయిట్‌ను అక్టోబర్ 21వ తేదీన నిర్వహించనున్నారు. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య సమయంలో పరీక్ష చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇస్రో తెలిపింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి టీవీ-డీ1 టెస్ట్ ఫ్లయిట్ నిర్వహించనున్నారు. క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపడం.. ఆ తర్వాత సురక్షితంగా భూమికి తీసుకురావడానికి సంబంధించిన టెస్ట్ చేయనున్నారు. పీడనం లేని క్రూ మాడ్యూల్లో వ్యోమగాములను నింగిలోకి పంపించనున్నారు. అయితే ప్రస్తుతం చేయనున్న పరీక్షల్లో ఈ క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి సురక్షితంగా పంపి.. అక్కడి నుంచి సేఫ్‌గా బంగాళాఖాతంలో ల్యాండ్ చేయనున్నారు. అక్కడి నుంచి ఇండియన్ నేవీ ఆ మాడ్యూల్ మిషన్‌ను తీసుకురానున్నట్లు ఇస్రో వెల్లడించింది.