Mon Nov 25 2024 05:01:19 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే పెళ్లి పార్టీ కార్యకర్తతోనే
ఒక సాధారణ కార్యకర్తతో ఎమ్మెల్యే వివాహం జరిగింది. పంజాబ్ లో ఈ వేడుక జరిగింది.
ఒక సాధారణ కార్యకర్తతో ఎమ్మెల్యే వివాహం జరిగింది. పంజాబ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నరీందర్ కౌర్ భరాజ్ తన పార్టీ కార్యకర్త మణిదీప్ సింగ్ ను వివాహం చేసుకున్నారు. పటియాలలోని రోరేవాల్ గ్రామంలో జరిగిన ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హాజరయ్యారు. అతి చిన్న వయసులో నరీందర్ కౌర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 28 ఏళ్ల వయసులో ఆమె శాసనసభ్యురాలిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆమె లా డిగ్రీ చదివారు.
యువ ఎమ్మెల్యేగా...
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రోత్సాహంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో తమ గ్రామంలో ఆప్ కు చెందిన బూత్ ను ఏర్పాటు చేసి పార్టీ అధినాయకత్వం దృష్టిలో పడ్డారు. సంగ్రూర్ ఎమ్మెల్యే టిక్కెట్ పొందారు. మణిదీప్ సింగ్ సంగ్రూర్ జిల్లా మీడియా ఇన్ ఛార్జిగా పనిచేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం పరిణియంగా మారింది. ఈ వివాహం శుక్రవారం రోరేవాల్ గ్రామంలోని గురుద్వారాలో జరిగింది. వధూవరులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆశీర్వదించారు. అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై పార్టీ కార్యకర్తనే వివాహం చేసుకున్న ఆమెను అందరూ అభినందించారు.
Next Story