Mon Dec 23 2024 13:24:04 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మోదీ సమీక్ష.. కీలక నిర్ణయం దిశగా?
ప్రధాని మోదీ నేడు ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. కోవిడ్ పరిస్థితులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. ప్రధానంగా కోవిడ్ పరిస్థితులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. భారత్ ను మరోసారి కోవిడ్ భయం వెంటాడుతుంది. ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 213కు చేరడం ఆందోళన కల్గిస్తుంది. మొత్తం పన్నెండుకు పైగా రాష్ట్రాలకు ఈ ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. ఈ వేరియంట్ థర్డ్ వేవ్ కు దారితీస్తుందేమోనన్న సందేహాలను కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కట్టడికి....
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు కరోనా కేసులను కట్టడి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇందుకోసం అవసరమైతే ఆంక్షలను కఠినతరంచేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ లను పరిస్థితులను బట్టి విధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు జరిగే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story