Fri Dec 20 2024 01:34:00 GMT+0000 (Coordinated Universal Time)
Madhya Pradesh : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణం
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా రాజీవ్ శుక్లా, జగదీశ్ దేవ్డా ప్రమాణం చేశారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా రాజీవ్ శుక్లా, జగదీశ్ దేవ్డా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ లు హాజరయ్యారు. వారి సమక్షంలోనే మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
హాజరైన మోదీ...
భోపాల్ లోని లాల్ పరేడ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యనేతలంతా హాజరుకావడంతో పెద్దయెత్తున బీజేపీ శ్రేణులు హాజరయ్యారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్ లలో గెలిచిన భారతీయ జనతా పార్టీ ఈసారి కొత్త వారికి అవకాశం కల్పించింది. పాత వారిని పక్కన పెట్టి లోక్సభ ఎన్నికలకు ముందు కొత్త వారికి అవకాశమిచ్చింది.
Next Story