Sun Apr 13 2025 02:57:07 GMT+0000 (Coordinated Universal Time)
Monalisa : మోనాలిసాకు అదిరిపోయే ఛాన్స్.. ఆ హీరో పక్కన నటించే ఆఫర్
ప్రయాగ్ రాజ్ లో దండలు అమ్ముకుంటున్న మోనాలీసాకు బాలివుడ్ లో ఆఫర్ వచ్చింది

కొన్ని రోజుల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో ఒకే ఒక్క విషయం హైలెట్ అవుతూ వస్తుంది. పుణ్యస్నానాలకు కోట్లాది మంది భక్తులు రావడం అటుంచితే అక్కడ దండలు విక్రయించే యువతి మోనాలీసా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూ ట్యూబర్లు, టీవీ ఛానళ్లన్నీ ఆమె మీదనే ఫోకస్ చేయడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందమైన వెడల్పాటి కళ్లతో చూపరులను ఇలా కట్టిపడేసే మోనాలీసా అందానికి ముగ్దులవ్వని వారు ఎవరూ ఉండరు. చారడేసి కళ్లతో అందరినీ ఆకట్టుకునే మోనాలీసాకు ఇప్పుడు సినిమాలో ఛాన్స్ దక్కింది. తన సినిమాలో ఆమెకు ఆఫర్ ఇస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు ప్రకటించడంతో ఆమె దశ తిరిగేట్లు కనిపిస్తుంది.
ఒక్కసారిగా ఫేమస్ అయి...
మహాకుంభమేళాలో ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్ గా మారిన మోనాలీసా త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు. . ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో దండలు అమ్ముకుంటున్న ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిన కొందరు.. వెంటనే తన ఫోటోస్ నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోవడంతో ఇక ఆమె వద్దకు క్యూ కడుతున్నారు. ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ఆ అమ్మాయి కుంభమేళాలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే ఆమె తేనెకళ్లు.. చూడచక్కని రూపం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరి దృష్టిలో పడింది.
సనోజ్ మిశ్రా డైరెక్షన్ లో...
ఆ అమ్మాయి నెట్టింట పాపులర్ కావడంతో ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఇచ్చారన్న వార్త సంచలనం కలిగిస్తుంది. . డైరెక్టర్ సనోజ్ మిశ్రా త్వరలోనే ఆ అమ్మాయిని కలవనున్నారని తెలిసింది. సనోజ్ మిశ్రా మాట్లాడుతూ.. మోనాలిసా రూపం.. ఆమె అమాయకత్వాన్ని చూసి తాను ఫిదా అయ్యాయని.. తనకు డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని.. ఇందులో రైతు కూతురి పాత్ర కోసం మోనాలిసా సెట్ అవుతుందని.. త్వరలోనే ప్రయాగ్ రాజ్ వెళ్లి ఆమెను కలవనున్నట్లు తెలిపారు. మోనాలిసాకు యాక్టింగ్ నేర్పిస్తామని అన్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Next Story