Mon Dec 23 2024 05:28:15 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియాలో మంకీపాక్స్ కలవరం
ఇండియాలో మంకీపాక్స్ కలవరం రేపుతుంది. కేరళలోనే మూడో కేసు నమోదయింది.
ఇండియాలో మంకీపాక్స్ కలవరం రేపుతుంది. కేరళలోనే మూడో కేసు నమోదయింది. కేరళలోనే మూడు కేసులు నమోదయ్యాయి. ప్రపంచాన్నే వణికిస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు భారత్ లోనూ బాగానే ప్రవేశించింది. కేరళలోని మలప్పరం జిల్లాలో మంకీపాక్స్ కేసు తాజాగా నమోదయింది. ఈ వ్యక్తి యూఏఈ నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి నిర్ధారించారు. దీంతో కేరళలో విదేశాల నుంచి వచ్చిన వారికి అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేవలం కోవిడ్ పరీక్షలనే కాకుండా, మంకీపాక్స్ పరీక్షలు కూడా చేయాల్సి వస్తుందేమోనని కేరళ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
యూఏఈ నుంచి వచ్చిన....
యూఏఈ నుంచి వచ్చిన35 ఏళ్ల యువకుడిలో జ్వరం వచ్చింది. జులై 15న మంకీపాక్స్ లక్షణాలు కన్పించాయని అధికారులు తెలిపారు. దీంతో ఆ యువకుడిని మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అతనితో కాంటాక్ట్ అయిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంకీపాక్స్ తో బాధపడుతున్న మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. మొత్తం మీద కేరళలోనే మూడో మంకీపాక్స్ కేసు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది.
Next Story