Mon Dec 23 2024 14:52:29 GMT+0000 (Coordinated Universal Time)
71 కాలం చెల్లిన చట్టాలు రద్దు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో 71 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయనున్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో 71 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయనున్నారు. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం 32 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సమావేశాలు ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం జరిగింది. ఇటీవల జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో గెలిచిన వారి చేత స్పీకర్ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ గిరిజన యూనివర్సిటీ బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఓటు హక్కును....
పార్లమెంటు సమావేశాలకు ప్రారంభానికి ముందు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోదీ వెంట జేపీ నడ్డాతో పాటు ఇతర కేంద్ర మంత్రుల వచ్చారు. వరసగా కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ ఛెయిర్ లో వచ్చి ఓటు వేశారు.
Next Story