Mon Dec 23 2024 10:23:45 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో తల్లి,కూతురికి కరోనా.. ఇటీవలే చైనా నుండి..
తల్లి, కూతురి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు తెలిపారు. కాగా.. తమిళనాడులో ప్రస్తుతం 51 యాక్టివ్ కేసులుండగా..
చైనా నుండి ఇటీవలే తమిళనాడుకు వచ్చిన తల్లీకూతురికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దాంతో అధికారులు వెంటనే ఇద్దరినీ హోమ్ ఐసోలేషన్ కు తరలించారు. తమిళనాడు, మధురై సమీపంలోని విరుదు నగర్‌కు చెందిన ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు చైనా నుంచి కొలంబో మీదుగా మంగళవారం మధురైకి చేరుకున్నారు. అక్కడి ఎయిర్ పోర్టులో అధికారులు ప్రయాణికులందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్ గా తేలింది. వెంటనే అధికారులు అప్రమత్తమై ఆ ఇద్దరినీ హోమ్ ఐసోలేషన్ కు తరలించారు. వారి ద్వారా ఇతరులకు కరోనా వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.
తల్లి, కూతురి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు తెలిపారు. కాగా.. తమిళనాడులో ప్రస్తుతం 51 యాక్టివ్ కేసులుండగా.. మంగళవారం ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మళ్లీ మాస్కులు ధరించాలని, శానిటైజర్లను వాడాలని సూచిస్తూ.. ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చైనా సహా.. జపాన్, అమెరికా, కొరియా వంటి దేశాల్లో భారీస్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. భారత్ విదేశీ ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎయిర్ పోర్టులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Next Story